Nellore: విహార యాత్రలో విషాదం.. కండలేరు జలాశయంలో ముగ్గురు గల్లంతు..

|

Apr 12, 2022 | 8:06 PM

Kandaleru Reservoir: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కండలేరు జలాశయం సందర్శనకు వెళ్లిన ఒకే కుటుంబంలో ముగ్గురు గల్లంతయ్యారు

Nellore: విహార యాత్రలో విషాదం.. కండలేరు జలాశయంలో ముగ్గురు గల్లంతు..
Follow us on

Kandaleru Reservoir: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కండలేరు జలాశయం సందర్శనకు వెళ్లిన ఒకే కుటుంబంలో ముగ్గురు గల్లంతయ్యారు. రిజర్వాయర్‌లోని 8.5 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కొలపనాయుడు పల్లి గ్రామంలో వడియాల వ్యాపారం చేస్తోన్న ఓ కుటుంబం కండలేరు రిజర్వాయర్‌ అందాలను వీక్షించేందుకు వచ్చింది. అయితే ప్రమాదవశాత్తూ రిజర్వాయర్‌లో మునిగిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన పన్ను కుమార్,పవిత్ర,లక్ష్మి అనే ముగ్గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Travel Insurance: ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఎలా లెక్కిస్తారో తెలుసా..

ICHR Recruitment 2022: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల..ఖాళీలెన్నంటే..

Big News Big Debate: ధాన్యంపై దంగల్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. వార్‌లో కీలక ముందడుగు