మరో లంచగొండి ప్రభుత్వాధికారి బాగోతం, చిట్టివలసలో 70వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏపీఈపీడీసీఎల్ సెక్షన్ ఏఈఈ రమణ

ప్రజల సొమ్ములతో పుష్కలంగా జీతాలందుకుంటూ సర్కారు నౌకరీగిరి వెలగబెడుతోన్న కొందరు ఇంకా ప్రజల్ని పీక్కుతింటున్నారు. తాజాగా విశాఖపట్నం చిట్టివలసలో..

మరో లంచగొండి ప్రభుత్వాధికారి బాగోతం, చిట్టివలసలో 70వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏపీఈపీడీసీఎల్ సెక్షన్ ఏఈఈ రమణ

Updated on: Feb 05, 2021 | 2:07 AM

ప్రజల సొమ్ములతో పుష్కలంగా జీతాలందుకుంటూ సర్కారు నౌకరీగిరి వెలగబెడుతోన్న కొందరు ఇంకా ప్రజల్ని పీక్కుతింటున్నారు. తాజాగా విశాఖపట్నం చిట్టివలసలో ఎలక్ట్రిక్ అధికారికి ఏసీబీ అధికారులు షాక్ ఇచ్చారు. లంచం కోసం పట్టిపీడిస్తున్న ఎలక్ట్రికల్ ఏఈఈ భరతం పట్టారు. చిట్టివలస ఏపీఈపీడీసీఎల్ సెక్షన్ ఏఈఈగా ఉన్న రమణ.. మీటర్ కనెక్షన్ కోసం లంచం అడిగాడు. ఏకంగా లక్ష చెల్లించాల్సిందేనని పట్టుబట్టాడు. చివరకు 70 వేలకు బేరం సెట్ చేసి డీల్ కుదిర్చాడు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ బాధితుడు.. ఏసీబీని అశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. అవినీతి ఏఈఈని ఉచ్చులోకి దింపారు. 70 వేలు లంచం తీసుకుంటుండగా రమణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ లో పాల్గొన్నారు.

అమెరికా కొత్త అధ్యక్షుడి ఫారిన్ పాలసీ ఫస్ట్ స్పీచ్, భారీ సంస్కరణల దిశగా జో బైడెన్ అడుగులు

గత 60 ఏళ్లలో ఏనాడూ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చూడని ఊరది, ఇప్పుడు కొత్త టర్న్.. ఆరుగురు మహిళలు నువ్వా, నేనా.? అంటున్నారు