Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
Road Accident

Updated on: Dec 17, 2023 | 11:55 AM

అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ సమీపంలో రాళ్ల లోడుతో వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో పక్కకు నిలిపారు.

అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న ఖాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us