Mobile Chat: బాయ్ ఫ్రెండ్ తో కబుర్లు కట్టిపెట్టమన్నందుకు.. సొంత తమ్ముడిని ఏం చేసిందంటే..

|

Apr 14, 2021 | 8:55 PM

తొమ్మిదేళ్ల కొడుకు కనిపించడం లేదని ఆ తల్లిదండ్రులు వెతుకులాడారు. తెలిసిన వారినందరినీ అడిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఫలితం లేదు.

Mobile Chat: బాయ్ ఫ్రెండ్ తో కబుర్లు కట్టిపెట్టమన్నందుకు.. సొంత తమ్ముడిని ఏం చేసిందంటే..
Follow us on

Mobile Chat: తొమ్మిదేళ్ల కొడుకు కనిపించడం లేదని ఆ తల్లిదండ్రులు వెతుకులాడారు. తెలిసిన వారినందరినీ అడిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఫలితం లేదు. రెండు రోజుల తరువాత ఇంటి స్టోర్ రూమ్ నుంచి దుర్వాసన వస్తుంటే చూశారు. అక్కడ ఆ చిన్నోడి మృతదేహం కనిపించింది. దాంతో బావురుమన్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం ఉన్న వారి పేర్లు చెప్పమంటే దాదాపు 25 మంది పేర్లు చెప్పారు. కానీ, వారెవరికీ దీనితో సంబంధం లేదని తేల్చారు పోలీసులు. తరువాత కుటుంబ సభ్యులను ఒక్కొరినీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దర్యాప్తులో భాగంగా అనుమానం వచ్చిన ఏ విషయాన్నీ పోలీసులు విడిచి పెట్టలేదు. సరిగ్గా ఆ సమయంలో హత్యకు గురైన బాబు అక్కను పరిశీలించిన పోలీసులకు ఎక్కడో తేడా కొట్టింది. ఆమె చేతి మీద ఉన్న గాయాలు అనుమానాన్ని కలిగించాయి. పదిహేనేళ్ల ఆ పాపను ప్రశ్నించేసరికి ఆమె చెప్పిన విషయం విని అందరూ షాక్ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ టీనేజ్ బాలికకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. తరచూ ఆ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతుండేది. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతె ఇక ఆమె ఫోన్ కబుర్లకు అంతు ఉండేది కాదు. ఇది గమనించిన ఆమె తమ్ముడు తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు ఆమెను గట్టిగా మందలించారు. అయినా ఆమె తీరు మారలేదు. ఐదు రోజుల క్రితం తన తల్లిదండ్రులు లేని సమయంలో బే ఫ్రెండ్ తో కబుర్లలో పడిపోయింది ఆ పిల్ల. దీంతో ఆమె తమ్ముడు అక్కను మందలించడంతో.. కోపం వచ్చిన ఆ టీనేజీ బాలిక న ఇయర్‌ ఫోన్స్‌ తమ్ముడి మెడకి బిగించి అమానుషంగా అంతమొందించింది. తమ్ముడు చనిపోయాడని నిర్ధారించుకుని గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని లాక్కెళ్లి స్టోర్‌ రూం పడేసి చేతులు దులుపుకుంది. ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు తమ్ముడు కనిపించడం లేదని చెప్పడంతో చుట్టుపక్కల వెతికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను జువైనెల్ హోమ్‌కి తరలించారు.

Also Read: మైక్రోఇల్లు !కాంక్రీటు పైపు లో సింగిల్ బెడ్ రూమ్..అతి తక్కువ ధరలోనే వీడియో..ఫిదా అవుతున్న నెటిజెన్లు :Viral Video.

సాయిపల్లవి అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్.. రానా దగ్గుపాటి ‘విరాట పర్వం’ వాయిదా..