Hyderabad: వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో అపార్ట్‌మెంట్‌ గోడను ఢీకొట్టిన యువకులు..

కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదవశాత్తూ రోడ్డుపై పల్టీలు కొట్టి ఆపై ఓ అపార్ట్‌మెంట్‌ గోడను బలంగా ఢీకొట్టింది

Hyderabad: వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో అపార్ట్‌మెంట్‌ గోడను ఢీకొట్టిన యువకులు..
Representative Image

Updated on: Jan 01, 2022 | 12:51 PM

కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదవశాత్తూ రోడ్డుపై పల్టీలు కొట్టి ఆపై ఓ అపార్ట్‌మెంట్‌ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఆందోళనకు గురయ్యారు. ఆంధ్రకేసరి నగర్ లో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న వారితో పాటు ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే కారు నడుపుతున్న యువకులు మద్యం మత్తులో ఉన్నారని అపార్ట్‌మెంట్‌ వాసులు చెబుతున్నారు. ప్రమాదానికి కొద్ది నిముషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్‌మెంట్ లోపలికి వెళ్లడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదంటున్నారు.

కాగా న్యూ ఇయర్ కేకు తో కారులో వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీ సీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా కాలనీలోని ఖాళీ స్థలం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని కాలనీ వాసులు చెబుతున్నారు. కొందరు విచ్చలవిడిగా గంజాయి, మద్యం తీసుకుంటున్నారన్నారు. ఈ విషయంపై పోలీస్ లకు ఫిర్యాదు చేసినా..పట్టించు కోవటం లేదని కాలనీ వాసుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీపీఎస్సీలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..

Kangana Ranaut: ముక్కంటీశుని సేవలో కంగనా రనౌత్‌.. రాహుకేతు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లింపు..

Happy New Year 2022: టీ20 ప్రపంచకప్‌.. ఆసియాకప్‌.. ఈ ఏడాది టీమిండియా ఆడే మ్యాచ్ లివే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us