Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

తెలుగు షార్ట్ ఫిల్మ్‌లో నటించనున్న డ్వెయిన్ బ్రావో

, తెలుగు షార్ట్ ఫిల్మ్‌లో నటించనున్న డ్వెయిన్ బ్రావో

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో తెలుగు షార్ట్ ఫిల్మ్‌లో నటించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  తెలుగు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విషయంపై ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నారు. సమాజంలో సమస్యలను పాలద్రోలేందుకు కార్పోరేట్ సంస్థల అధినేతలు ముందుకు రావాలనేది ఈ షార్ట్ ఫిల్మ్ ముఖ్య ఉద్దేశ్యం.  కాన్సెప్ట్ నచ్చడంతో బ్రావో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంభందించిన అగ్రిమెంట్ శనివారం జరిగింది.

ఈ షార్ట్ ఫిల్మ్ ఇండియాలోని కోయంబత్తూర్, తమిళనాడులతో పాటు వెస్టిండీస్‌లోని టొబాగో మరియు ట్రినిడాడ్‌లో చిత్రీకరించనన్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతో నిర్మాత చేస్తున్న ఈ ప్రయత్నంను బ్రావో అభినందించి ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

Related Tags