క‌రోనా క‌ట్ట‌డికి గాంధీపురం గ్రామ‌స్తులు ఇలా…

క‌రోనా మ‌హ‌మ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కోయంబత్తూరు శివారు కేరళ సరిహద్దులో ఉన్న కుగ్రామం గాంధీపురం వాసులు మరింత అప్రమత్తమయ్యారు. పాతకాలపు పద్ధతుల్లో ...

క‌రోనా క‌ట్ట‌డికి గాంధీపురం గ్రామ‌స్తులు ఇలా...
Follow us

|

Updated on: Mar 23, 2020 | 11:22 AM

కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో జనంలో ఆందోళన రెట్టింపవుతోంది. నగర వాసుల్లోనే కాదు, కుగ్రామాల్లోని ప్రజలను ఈ వైరస్‌ వణికిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కోయంబత్తూరు శివారు కేరళ సరిహద్దులో ఉన్న కుగ్రామం గాంధీపురం వాసులు మరింత అప్రమత్తమయ్యారు. పాతకాలపు పద్ధతుల్లో అమ్మ వారు వచ్చినప్పుడు, గాలి సోకినా, గ్రామాల్లో ఏదేని రుగ్మతులు సోకినప్పుడు ఏ విధంగా ఆచరిస్తారో అదే తరహాలో ముందుకు సాగారు. అక్క‌డి గ్రామ‌స్తులు చేసిన తంతు మొత్తం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారి చ‌క్క‌ర్లు కొడుతోంది.

కేర‌ళ‌, తమిళనాడు సరిహద్దులో గ‌ల కుగ్రామం గాంధీపురం..ఇక్క‌డి స్థానికులు కూడా క‌రోనా వైర‌స్ భ‌యంతో వ‌ణికిపోతున్నారు. క‌రోనాను త‌రిమికొట్టేందుకు న‌డుం గాంధీపురం గ్రామ‌స్తులంతా ఏమ‌య్యారు. ప్రాణాంత‌క వైర‌స్ త‌మ గ్రామంలోకి ప్ర‌వేశించ‌కుండా ఉండేందుకు గానూ వినూత్న రీతిలో చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే త‌మ గ్రామానికి వచ్చే ఒక్కగానొక్క బస్సును గ్రామస్తులే శుభ్రం చేశారు. బస్సును శుభ్రం చేయడంతో పాటు దానికి వేపాకులతో తోరణాలు కట్టారు. బస్సు చుట్టూ, సీట్లలో వేప ఆకులు చ‌ల్లారు. బస్సు ముందు భాగంలో నిమ్మకాయ మాల‌లు వేశారు. బస్సు లోపల కూడా అక్క‌డ‌క్క‌డ నిమ్మకాయలు ఉంచారు. బస్సును మొత్తం పసుపు మయం చేస్తూ..బ‌స్సంతా ప‌సుపురాశారు. పసుపు పూయడమే కాదు, పసుపు నీళ్లు చల్లారు.

ఇక బ‌స్సులో ఎక్కే వారంతా చేతులు, కాళ్లను, పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవాల‌ని చెప్పారు. అలా వ‌చ్చిన వారిని మాత్ర‌మే బస్సులోకి అనుమతించారు. అలా బ‌స్సులోకి ఎక్కే క్ర‌మంలో ప్ర‌యాణికులంతా ఝూమ్‌.. మంత్రకాళి..క‌రోనా పారిపో… అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Read this also:నేటి నుంచి బ్యాంకుల్లో ఆ సేవలన్నీ బంద్!

హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే..
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే..
OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!
OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!
ఎండాకాలం కాసులు కురిపించే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ
ఎండాకాలం కాసులు కురిపించే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ
ఒక్క సినిమా రూ.120 కోట్ల రెమ్యునరేషన్ | ముద్దుల హీరోగా డార్లింగ్.
ఒక్క సినిమా రూ.120 కోట్ల రెమ్యునరేషన్ | ముద్దుల హీరోగా డార్లింగ్.
కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా?
కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా?
ఎప్పుడూ జరిగితే అనుభవం. ఎప్పుడో జరిగితే అద్భుతం.! పుష్ప ఎంజాయ్.
ఎప్పుడూ జరిగితే అనుభవం. ఎప్పుడో జరిగితే అద్భుతం.! పుష్ప ఎంజాయ్.
ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బానిసైన హీరోయిన్..
ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బానిసైన హీరోయిన్..
అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌
అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌
ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా?
ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా?