కరోనా వైరస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘చల్లబడ్డారు’. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగు పడేముందు దీని తీవ్రత మరింత పెరగవచ్చునని ఆయన హెచ్చరించారు.అమెరికాలో కొన్ని చోట్ల పరిస్థితి మెరుగు పడినా మరికొన్ని చోట్ల తీవ్రంగా ఉందన్నారు. కోవిడ్-19 పై మళ్ళీ వైట్ హౌస్ లో మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన ఆయన.. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు ఫేస్ మాస్కులు ధరించాలని సూచించారు.( దేశంలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినవారి సంఖ్య లక్షా 41 వేలకు పెరిగింది.) భౌతిక దూరాన్ని పాటించలేనప్పుడు మాస్కులు తప్పనిసరి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ని అదుపు చేయడమే కాదు.. ఇది పూర్తిగా అంతమయ్యేలా చూడాలి.. కోవిడ్ 19 వ్యాక్సీన్ ఉత్పాదన కోసం అనేక దేశాలు కృషి చేస్తున్నాయని, ఏ దేశం విజయవంతంగా ఈ రేసులో మొదటి స్థానంలో వచ్చినా ఆ దేశంతో కలిసి పని చేసేందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో చైనాతో సరే అని తొలిసారిగా వ్యాఖ్యానించారు.