‘గేమ్ ఛేంజర్ డ్రగ్’ డేంజర్ కూడా ! బీ అలర్ట్ !

| Edited By: Pardhasaradhi Peri

Apr 08, 2020 | 8:09 PM

మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును 'గేమ్ ఛేంజర్ డ్రగ్ ' గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. కరోనా చికిత్సకు ఇది అద్భుతమైన మందు అని వ్యాఖ్యానించారు. పైగా ఈ మెడిసిన్ ని తమకు పంపాల్సిందిగా ఇండియాను కోరారు.

గేమ్ ఛేంజర్ డ్రగ్ డేంజర్ కూడా ! బీ అలర్ట్ !
Follow us on

మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును ‘గేమ్ ఛేంజర్ డ్రగ్ ‘ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. కరోనా చికిత్సకు ఇది అద్భుతమైన మందు అని వ్యాఖ్యానించారు. పైగా ఈ మెడిసిన్ ని తమకు పంపాల్సిందిగా ఇండియాను కోరారు.. పంపకపోతే తాను కూడా ఊరుకునేది లేదని, ప్రతీకార చర్యకు దిగవచ్చునని వార్నింగ్ ఇచ్చ్చారు. ఆయన ఈ మందును ఇంతగా పొగిడినప్పటికీ, ఇదేమంత మంచి మందు కాదని ఆరోగ్య నిపుణులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా వృధ్ధ కరోనా రోగులకు ఈ మందును వాడితే వారి కంటి చూపు దెబ్బ తినవచ్చునని, మెదడుకు సంబంధించిన రుగ్మత, మతిమరుపు, డిప్రెషన్ వంటి అనేక శారీరక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. చైనాలో మొదట కరోనా రోగులు ఆస్పత్రులకు రాగా.. డాక్టర్లకు ఏ మందులు వాడాలో తొలుత తెలియలేదని, ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ తో బాటు హెచ్ ఐ వీ కి వాడే మందులను కూడా వాడారని వారు గుర్తు చేశారు. చైనాతో బాటు సౌత్ కొరియా, ఫ్రాన్స్, అమెరికా, ఇండియాలో ముఖ్యంగా భిల్వారాలో ఈ మెడిసిన్ వాడినప్పుడు కొంతవరకు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కానీ దీనివల్లసైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని సాక్షాత్తూ అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్ సైట్ లో పేర్కొందని వారు తెలిపారు.