వీరు ఇంటిపైకి మిడుతల దండు దాడి

|

Jun 28, 2020 | 9:34 AM

టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపైకి మిడుతల దండు దాడిచేసింది. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో మిడతలు విరుచుకుపడుతున్నాయి.

వీరు ఇంటిపైకి మిడుతల దండు దాడి
Follow us on

టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపైకి మిడుతల దండు దాడిచేసింది. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో మిడతలు విరుచుకుపడుతున్నాయి. మిడుతల దాడిలో రైతులతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నవారు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లోని కాంక్రీట్ ఫారెస్ట్ పై అవి దాడి చేశాయి. దీంతో అధికారులు అక్కడి నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏ సమయంలోనైనా మిడతలు దాడి చేయొచ్చని ప్రజలంతా తమ ఇళ్ల కిటికీలను, తలుపులను మూసిపెట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. గురుగ్రామ్‌నే కాకుండా ఢిల్లీ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి. అయితే తాజాగా వీరు నివాసం ఉంటున్న ఇంటి పైకి ఈ మిడుతల దండు దాడిచేసింది. మిడుతల దండు దాడి చేసిన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీరు.

 

కాగా, ఇప్పటికే ఢిల్లీ నగరం కరోనా వైరస్‌ వ్యాప్తితో విలవిల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ అక్కడ కేసులు అధికమవుతున్నాయి. ఇప్పుడు మిడతల దాడితో అక్కడి అధికారులకు కొత్త తలనొప్పి వచ్చిపడింది.