బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు

| Edited By:

Jul 20, 2020 | 12:36 PM

ఇప్పటివరకూ అగ్ని పర్వతం బద్ధలైంది అనే మాటలు మాత్రమే విని షాక్‌కి గురయ్యేవాళ్లం. కానీ మొదటి సారిగా అగ్ని పర్వతం బద్ధలైన దృశ్యాలను కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. తాజాగా ఇటలీలో అగ్ని పర్వతం బద్ధలైంది. ఆ అగ్ని పర్వతం నుంచి లావా ఒక్క సారిగా..

బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు
Follow us on

ఇప్పటివరకూ అగ్ని పర్వతం బద్ధలైంది అనే మాటలు మాత్రమే విని షాక్‌కి గురయ్యేవాళ్లం. కానీ మొదటి సారిగా అగ్ని పర్వతం బద్ధలైన దృశ్యాలను కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. తాజాగా ఇటలీలో అగ్ని పర్వతం బద్ధలైంది. ఆ అగ్ని పర్వతం నుంచి లావా ఒక్కసారిగా ఎగిసిపడంది. దీంతో చుట్టుపక్కల వరకూ కొన్ని కిలోమీటర్ల మేర దట్టమైన పొగ వ్యాపించింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనను ఎంతో కష్టపడి కెమెరాల్లో బంధించారు.

అగ్ని పర్వతం బద్ధలైనటువంటి సమయంలో.. నిప్పులా ఉప్పొంగుతూ వచ్చిన లావా అతి భయంకరంగా ఉంది. ఈ ఘటన జులై 19వ తేదీ తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగింది. దీన్ని ఎలా చిత్రీకరించారంటే.. అగ్నిపర్వతం పేలక ముందు ఆ ప్రాంతంలో కెమెరాలు, వెబ్ క్యామ్స్ బిగించారు. వాటిలో పేలుడు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సుమారు నాలుగు నిమిషాల పాటు ఈ లావా విరజిమ్మింది. అయితే ఈ పేలుడు అంత శక్తివంతమైనది కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Read More: మరో మంత్రికి కరోనా పాజిటివ్..