గ్రేట‌ర్‌పై క‌రోనా పంజా..సీఎం కేసీఆర్‌కు కిష‌న్ రెడ్డి లేఖ‌

|

Jun 09, 2020 | 8:22 PM

గ్రేటర్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది...హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుందని కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి..

గ్రేట‌ర్‌పై క‌రోనా పంజా..సీఎం కేసీఆర్‌కు కిష‌న్ రెడ్డి లేఖ‌
Follow us on

గ్రేటర్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ ఎవరి ద్వారా వైర‌స్‌ వ్యాప్తి చెందుతుందో అన్న భయం అందరిలో నెలకొంది. అలాగే కాంటాక్టు లను గుర్తించడం కూడా కష్టంగా మారింది. దీంతో గతవారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నవెూదవుతూనే ఉన్నాయి. చివరకు జిహెచ్‌ఎంసి, సచివాలయ ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో ఉద్యోగుల్లో సైతం భయం నెలకొంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుందని కిషన్ రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు. ప్రజల్లో అభద్రతాభావం, భయం పెరుగుతుందని వెల్ల‌డించారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళన, భ‌యాల‌ను తొలగించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో ప్రస్తావించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలని కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగాన్ని వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తూ, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు రాష్ట్ర‌ప్ర‌భుత్వం అమ‌లు ప‌ర్చాల‌ని కిష‌న్ రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు.