బ్రేకింగ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్

ఈ నెల 31వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్ కానున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌లు ఈ రకమైన నిర్ణయాన్ని..

బ్రేకింగ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్

Updated on: Mar 22, 2020 | 7:47 PM

ఈ నెల 31వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్ కానున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌లు ఈ రకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే.. మార్చి 31వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాలూ లాక్‌డౌన్ చేస్తున్నట్లు ఇరు రాష్ట్రాల సీఎంలు తాజాగా ప్రకటించారు.

అలాగే అత్యవసర సేవలకు, నిత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటించాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మొత్తాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిత్యవసర దుకాణాలు తప్ప.. మిగతావన్నీ బంద్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా మార్చి 31వ తేదీ వరకూ అందరూ ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. కాగా.. ఈనెల 31 వరకూ రెండు తెలుగు రాష్ట్రాలూ లాక్‌డౌన్‌లో ఉంటాయన్నారు. ఈ రోజు ఏవిధంగా బాధ్యతాయుధంగా కర్ఫ్యూని పాటించారో.. మార్చి 31వ తేదీ వరకూ ఈ విధంగానే ఇంట్లో ఉండాలని వారు కోరారు. దయచేసి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. అలాగే లేబర్స్‌ని కూడా ప్రత్యేకంగా గుర్తించి ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులు క్లోజ్ చేస్తున్నామని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతించబోమన్నారు. ప్రైవేట్ బస్సులు కూడా బంద్ చేస్తున్నామన్నారు.అలాగే.. తెల్ల రేషన్ కార్డున్న వారికి రేషన్ బియ్యంతో పాటు కుటుంబానికి వెయ్యిరూపాలయను ఏపీ ప్రభుత్వం, రూ.1500లను తెలంగాణ ప్రభుత్వం అందించనుంది.

Read more also: 

మార్చి 31 వరకూ తెలంగాణలో ఆల్ మద్యం షాపులు బంద్

ఫ్లాష్ న్యూస్: మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్

జనతా కర్ఫ్యూ తర్వాత ప్రజలకు మోదీ మరో సూచన

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్

 కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..

Loading...
Unable to load recommendations.
Follow Us