AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనితో పని చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ప్రత్యేకం: మాళవిక మోహనన్

కథ ఎంత ముఖ్యమో.. ఆ కథలో భాగమయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా అంతే ముఖ్యమని అంటున్నారు కథానాయిక మాళవిక మోహనన్‌. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దక్షిణాది సినిమాలతో పాటు హిందీ చిత్రసీమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

Rajeev Rayala
|

Updated on: Oct 03, 2026 | 2:03 PM

Share
కథ ఎంత ముఖ్యమో.. ఆ కథలో భాగమయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా అంతే ముఖ్యమని అంటున్నారు కథానాయిక మాళవిక మోహనన్‌. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దక్షిణాది సినిమాలతో పాటు హిందీ చిత్రసీమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ‘సర్దార్‌ 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ.. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన ‘పాకెట్‌ నోవెల్‌’ కోసం ఎదురుచూస్తున్నారు. 

1 / 5
ఈ సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మాళవిక మోహనన్‌ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. సినిమా షూటింగ్‌ అనేది కేవలం కెమెరా ముందు నటించడం మాత్రమే కాదని.. ఒక బృందంతో కలిసి నెలల తరబడి ప్రయాణించడం, వారితో ఎన్నో అనుభవాలను పంచుకోవడం కూడా అందులో భాగమేనని ఆమె పేర్కొన్నారు. కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో ఆ చిత్ర బృందమే ఒక ప్రత్యేకమైన ప్రపంచంలా మారిపోతుందని మాళవిక తెలిపారు.  

2 / 5
పాకెట్‌ నోవెల్‌ కూడా తనకు అలాంటి అనుభూతినే ఇచ్చిందని చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. షూటింగ్‌ సమయంలో నటీనటులు, సాంకేతిక బృందం కలిసి ఎక్కువ సమయం గడుపుతారని.. రోజులో ఎన్నో గంటలు కలిసి పనిచేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారని మాళవిక వివరించారు. ఈ క్రమంలోనే చిత్ర బృందంలోని వ్యక్తులు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లా మారిపోతారని ఆమె అభిప్రాయపడ్డారు.

3 / 5
 ‘పాకెట్‌ నోవెల్‌’లో విజయ్‌ సేతుపతితో కలిసి పనిచేయడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని మాళవిక మోహనన్‌ చెప్పుకొచ్చారు. ఆయన వంటి ప్రతిభావంతుడైన నటుడితో స్క్రీన్‌ పంచుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రయాణాన్ని మరొకరితో ఊహించుకోలేనంతగా ఈ బృందంతో అనుబంధం ఏర్పడిందని ఆమె తన పోస్ట్‌లో చెప్పినట్లు తెలుస్తోంది.

4 / 5
సినిమా విడుదలకు ముందే మాళవిక చేసిన ఈ వ్యాఖ్యలు.. ‘పాకెట్‌ నోవెల్‌’పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం విజయ్‌ సేతుపతి, మాళవిక మోహనన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి తెరపై ఈ జోడీ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

5 / 5
Follow Us