అమ్మో డేంజర్ వైరస్.. నెగిటివ్ పేషెంట్లకు మళ్లీ కరోనా పాజిటివ్..

అమ్మో డేంజర్ వైరస్.. నెగిటివ్ పేషెంట్లకు మళ్లీ కరోనా పాజిటివ్..

అమ్మో.. డేంజర్ వైరస్.. కరోనా నెగిటివ్ పేషెంట్లకు మళ్లీ పాజిటివ్ వస్తోంది. కానీ వైద్య శాస్త్రంలో ఓ రూల్ ఉంది. ఓ సారి వైరస్ సోకిన వ్యక్తులకు.. తిరిగి మళ్లీ కొన్నేళ్లు పోయేదాకా.. ఆ వైరస్ ఆ వ్యక్తికి తిరిగి సోకదు. ఎందుకంటే.. ఆ వైరస్‌ని తరిమేసే యాంటీబాడీస్..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 11, 2020 | 5:42 PM

అమ్మో.. డేంజర్ వైరస్.. కరోనా నెగిటివ్ పేషెంట్లకు మళ్లీ పాజిటివ్ వస్తోంది. కానీ వైద్య శాస్త్రంలో ఓ రూల్ ఉంది. ఓ సారి వైరస్ సోకిన వ్యక్తులకు.. తిరిగి మళ్లీ కొన్నేళ్లు పోయేదాకా.. ఆ వైరస్ ఆ వ్యక్తికి తిరిగి సోకదు. ఎందుకంటే.. ఆ వైరస్‌ని తరిమేసే యాంటీబాడీస్.. ఆ వ్యక్తిలో తయారవుతాయి. అవి తిరిగి వైరస్‌ని బాండీలోకి రానివ్వవు. కానీ కరోనా వైరస్ విషయంలో ఈ రూల్ పనిచేయడం లేదు. దక్షిణ కొరియాలో చాలా మందికి కరోనా నయమై.. నెగెటివ్ అయి తిరిగి మళ్లీ పాజిటివ్ వచ్చేస్తోంది. ఈ విషయంలో ఎందుకంటే కరోనా నెగటివ్ వచ్చిన వ్యక్తి.. ఇక నాకు వైరస్ సోకదులే అని అనుకోవడానికి వీళ్లేదు. మళ్లీ సోకే ప్రమాదం ఉందని సౌత్ కొరియా శాస్త్రవేత్తలు హెచ్చరిక సందేశాలు పంపారు.

ప్రస్తుతం దక్షిణ కొరియాలో 10,450 కరోనా కేసులు నమోదుకాగా.. 208 మంది మరణించారు. అలాగే 7,117 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వారిలో 91 మందికి పరీక్షలు నిర్వహించగా.. మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చిందని దక్షిణ కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జియాంగ్ ఇయున్ కియోంగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక అసలు సమస్య ఏంటంటే.. ఓసారి కరోనా నయం అయిన తరువాత కూడా వైరస్ సోకిన వ్యక్తి శరీరంలో కోవిడ్-19 జన్యువులు అలాగే ఉంటాయట. అవి తిరిగి రీ-యాక్టివేట్ అవుతున్నాయని తెలిపారు. బయటి నుంచి వైరస్ సోకకపోయినా.. బాడీ లోపలే జన్యువుల యాక్టివేషన్ వల్ల మళ్లీ కరోనా పాజిటివ్ వస్తుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. అలాగే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 7,117 మందికి మళ్లీ టెస్టులు చేయనున్నారట. వీరిలో మళ్లీ ఎవరికైనా కరోనా వస్తే.. వీరితో పాటు వారి ఫ్యామిలీ, బంధువులకు కూడా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

అయితే చైనాలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపిండ లేదు. ఒకరికో.. ఇద్దరికో ఇలా అయ్యింది తప్పించి.. మళ్లీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అందువల్ల చైనా ఈ రీ ఎఫెక్ట్ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ కారణంగానే కోలుకున్న అందరినీ వదిలేసింది. కానీ దక్షిణ కోరిమా మాత్రం ఇది ఆరంభం మాత్రమేనని అంటోంది. కాబట్టి కరోనా వచ్చి డిశ్చార్జి అయిన పేషంట్లపై కూడా ఓ కన్నేసి ఉంచాలని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి

బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌ నియామకం

మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..

కరోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం.. రూ.1900 కోట్ల విరాళం

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu