టోక్యో ఒలంపిక్ వాయిదా వేయండి…

|

Jul 04, 2020 | 8:19 PM

కరోనాతో ప్రపంచం మొత్తం నిలిచిపోయింది. అన్ని కార్యక్రమాలు వాయిదాలు పడుతున్నాయి. సినిమా రంగం నుంచి మొదలు… క్రీడా రంగం వరకు అన్ని వాయిదాలతో సాగుతున్నాయి. ఇందులో ఐపీఎల్ వంటి భారీ క్రీడలు కూడా ఇదే పద్దతిలో ముందుకు పోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టోక్యో ఒలంపిక్ గేమ్స్ కూడా చేరిపోయింది. ఈ నెల 23 న ప్రారంభం కావాల్సిన ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ వైరస్ […]

టోక్యో ఒలంపిక్ వాయిదా వేయండి...
Follow us on

కరోనాతో ప్రపంచం మొత్తం నిలిచిపోయింది. అన్ని కార్యక్రమాలు వాయిదాలు పడుతున్నాయి. సినిమా రంగం నుంచి మొదలు… క్రీడా రంగం వరకు అన్ని వాయిదాలతో సాగుతున్నాయి. ఇందులో ఐపీఎల్ వంటి భారీ క్రీడలు కూడా ఇదే పద్దతిలో ముందుకు పోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టోక్యో ఒలంపిక్ గేమ్స్ కూడా చేరిపోయింది. ఈ నెల 23 న ప్రారంభం కావాల్సిన ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ వైరస్ ప్రభావం అప్పటివరకు కూడా తగ్గేలా కనిపించడం లేదు. దాంతో వచ్చే ఏడాది కూడా మా దగ్గర ఈ గేమ్స్ నిర్వహించవద్దంటూ టోక్యో ప్రజలు ప్రభుత్వాన్ని మొర పెట్టుకున్నారు. టోక్యో లోని ఓ స్థానిక సంస్థ నిర్వహించిన సర్వేలో 51.7 శాతం మంది వాయిదా వేయాలని టోక్యో వాసులు కోరారు. ఇక ఇప్పటివరకు జపాన్ లో దాదాపు 20 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు అలాగే 976 మందిమరణించారు.