‘ఎక్కడున్నావు కన్నా’? ఓ వలస కూలీ కన్నీటి వ్యధ

తన చిన్నారి కొడుకు మరణించాడని తెలుసుకున్న ఆ వలస కూలీ కన్నీటికి అంతం లేకపోయింది. ఢిల్లీ నుంచి కాలినడకన ఎక్కడో బీహార్ లోని తన సొంత రాష్ట్రానికి బయల్దేరిన 38 ఏళ్ళ రాంపుకార్ పండిట్ వ్యధ ఇది !

ఎక్కడున్నావు కన్నా? ఓ వలస కూలీ కన్నీటి వ్యధ

Edited By: Pardhasaradhi Peri

Updated on: May 19, 2020 | 11:49 AM

తన చిన్నారి కొడుకు మరణించాడని తెలుసుకున్న ఆ వలస కూలీ కన్నీటికి అంతం లేకపోయింది. ఢిల్లీ నుంచి కాలినడకన ఎక్కడో బీహార్ లోని తన సొంత రాష్ట్రానికి బయల్దేరిన 38 ఏళ్ళ రాంపుకార్ పండిట్ వ్యధ ఇది ! ఢిల్లీ సరిహద్దుల్లో ఓ రోడ్డు పక్కన ఫోన్ లో మాట్లాడుతూ అదేపనిగా కన్నీరు కారుస్తున్న ఇతడ్నిచూసి ఓ ఫోటోగ్రాఫర్  తన కెమెరాలో ఇతని ఫోటోను క్లిక్ మనిపించగా అది వైరల్ అయింది. పండిట్ దుస్థితి చూసి చలించిపోయిన ఓ మహిళ శ్రామిక్ రైల్లో అతడ్ని పంపేందుకు 5,500 వేల రూపాయల సాయం చేసింది. రైల్లో బెగుసరాయ్ చేరుకున్న ఇతడ్ని అధికారులు మొదట హాస్పిటల్ కి, ఆ తరువాత క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. అక్కడికి వఛ్చిన తన భార్య, ఏడేళ్ల కూతుర్ని చూసిన పండిట్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. వారిని దూరం నుంచే చూడాలని, కేవలం పది నిముషాలు మాత్రమే వారితో మాట్లాడాలని డాక్టర్లు, అధికారులు అతనికి సూచించారట. తనకు ఇష్టమైన ఫుడ్ ని తన కుటుంబం తెచ్చినా పండిట్ తినలేకపోయాడు. చివరకి అతనికి కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చిందట. అయినా 14 రోజుల పాటు క్వారంటైన్ లోనే ఉండాలని అధికారులు చెప్పడంతో పండిట్ నిరాశ చెందాడు.