Corona Death: భ‌యం.. క‌రోనా కంటే మ‌హా ప్ర‌మాదక‌రం.. క‌రోనా వ‌చ్చిందేమోన‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌..

|

Apr 22, 2021 | 11:25 AM

Corona Death: క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ మాన‌వాళిని అత‌లాకుతలం చేస్తోంది. క‌రోనా మ‌నుషులు శ‌రీరక ఆరోగ్యాల‌నే కాకుండా మాన‌సిక ఆరోగ్యాల‌ను కూడా పాడు చేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న...

Corona Death: భ‌యం.. క‌రోనా కంటే మ‌హా ప్ర‌మాదక‌రం.. క‌రోనా వ‌చ్చిందేమోన‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌..
Corona
Follow us on

Corona Death: క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ మాన‌వాళిని అత‌లాకుతలం చేస్తోంది. క‌రోనా మ‌నుషులు శ‌రీరక ఆరోగ్యాల‌నే కాకుండా మాన‌సిక ఆరోగ్యాల‌ను కూడా పాడు చేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు, మ‌ర‌ణాల సంఖ్య‌ను చూసి ఆరోగ్యంగా ఉన్న‌వారు కూడా భ‌యాందోళ‌న‌కు గురవుతున్నారు. భ‌య‌మే శ‌త్రువుగా మారి రోగిని మ‌రింత కుంగ దీస్తోంది. ఒక‌వేళ క‌రోనా సోకినా స‌రైన మందులు, ఆహారం తీసుకుంటే ఇట్టే దూర‌మ‌య్యే దాన్ని భ‌యంతో రెట్టింపు చేసుకుంటున్నారు. వైర‌స్ కంటే భ‌య‌మే ఇప్పుడు ప్ర‌మాదాక‌రంగా మారింది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ‌న్న‌వ‌రంలో జ‌రిగిన ఓ ఉదంతంమే దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ.
వివ‌రాల్లోకి వెళితే.. గ‌న్నవ‌రం మండ‌లం మ‌ర్ల‌పాలెంలో రాప‌ర్ల హ‌రిబాబు (74) అనే వ్య‌క్తి గ‌త మూడు రోజులుగా జ్వ‌రంతో పాటు ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాల‌తో బాద‌ప‌డుతున్నాడు. దీంతో స్థానికులంగా క‌రోనా సోకింది అంటూ హ‌డావుడి చేసి భ‌యాందోళ‌న‌కు గురి చేశారు. దీంతో తీవ్రంగా భ‌య‌ప‌డిన హ‌రిబాబు.. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష కూడా చేయించుకోకుండానే గ్రామంలోని చెరువులో దూకి ఆత్మ‌హత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంఘ‌ట‌న స్థానికంగా విషాధాన్ని నింపింది. గ‌న్న‌వ‌రం పోలీసులు మృత‌దేహాన్నిబ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చూశారుగా వైర‌స్ కంటే భ‌యం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో.. కాబ‌ట్టి మీ చుట్టూ ఉన్న వారికి ఎవరైనా ల‌క్ష‌ణాలు ఉన్నా.. క‌రోనా నిర్ధార‌ణ అయినా.. అన‌వ‌స‌రంగా భ‌యానికి గురి చేయ‌కుండా వారిలో ధైర్యాన్ని నింపుతూ చికిత్స అందిస్తే స‌రిపోతుంది. క‌రోనా దాని మానాన అది పారిపోతుంది.

Also Read: Remdesivir: రెమిడెసివర్ కొరత.. ఆసరా చేసుకుంటున్న కేటుగాళ్లు.. బ్లాక్‌లో యధేచ్చగా దందా.. డమ్మీ ప్రిస్క్రిప్షన్లతో కొనుగోళ్లు..!

సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం… కోవిడ్ సోకి ప్రముఖ దర్శకుడు మృతి… విషాదంలో చిత్రయూనిట్..

Corona Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నా క‌రోనా సోకుతుంది.. కానీ.. గ‌ణంకాల్లో ఆస‌క్తిక‌ర విష‌యాల వెల్ల‌డి..