విదేశీ కంపెనీలకు కళ్లెం.. టెండర్లలో దేశీయ సంస్థలకే అనుమతి

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2020 | 7:46 PM

200 కోట్ల వరకు వివిధ గ్లోబల్ టెండర్లలో కేవలం భారతీయ కంపెనీలను మాత్రమే అనుమతించనున్నామని ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. విదేశీ సంస్థలను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విదేశీ కంపెనీల నుంచి మన సంస్థలు అనుచిత పోటీని ఎదుర్కొంటున్నాయని, ఇకపై ఈ విధానాన్ని సాగనివ్వబోమని ఆమె చెప్పారు. కాగా-టాక్స్ ఆడిటింగ్ ని సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 31 వరకు పొడిగిస్తున్నామని, అలాగే సెప్టెంబరు […]

విదేశీ కంపెనీలకు కళ్లెం.. టెండర్లలో దేశీయ సంస్థలకే అనుమతి
Follow us on

200 కోట్ల వరకు వివిధ గ్లోబల్ టెండర్లలో కేవలం భారతీయ కంపెనీలను మాత్రమే అనుమతించనున్నామని ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. విదేశీ సంస్థలను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విదేశీ కంపెనీల నుంచి మన సంస్థలు అనుచిత పోటీని ఎదుర్కొంటున్నాయని, ఇకపై ఈ విధానాన్ని సాగనివ్వబోమని ఆమె చెప్పారు.

కాగా-టాక్స్ ఆడిటింగ్ ని సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 31 వరకు పొడిగిస్తున్నామని, అలాగే సెప్టెంబరు 30 తో ముగిసే అసెస్ మెంట్ ని డిసెంబరు 31 వరకు, వచ్ఛే ఏడాది మార్చి 31 తో ముగిసే అసెస్ మెంట్ ని అదే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగించామని ఆమె వివరించారు. ‘వివద్ సే విశ్వాస్’ పథకం కింద అదనపు పే మెంట్ లేని కాలాన్ని ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పొడిగించినట్టు తెలిపారు.