క‌రోనా అల‌ర్ట్ః మాంసాహారం, మసాలాలతో సమస్యలు

ఇటీవ‌ల గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు పెడుతున్న ఆహారంపైన కూడా మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌తనిచ్చారు. అయితే, తాజాగా గాంధీ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ రాజారావు క‌రోనా

క‌రోనా అల‌ర్ట్ః మాంసాహారం, మసాలాలతో సమస్యలు
Follow us

|

Updated on: Apr 27, 2020 | 3:46 PM

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌తివిష‌యంలోనూ అల‌ర్ట్ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ మేర‌కు వైర‌స్ బారిన‌ప‌డ్డవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏయే ప‌దార్థాలు తింటే వైర‌స్ నుండి త్వ‌ర‌గా కోలుకుంటారో తెలుసుకోవాల‌ని ఇప్పుడు అంద‌రూ గూగుల్‌లో తెగ స‌ర్చ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు పెడుతున్న ఆహారంపైన కూడా మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌తనిచ్చారు. అయితే, తాజాగా గాంధీ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ రాజారావు క‌రోనా పేషెంట్లు ఏ ఆహారం తీసుకోవాల‌నే దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల‌న్నింటిలో దాదాపుగా అంద‌రికీ సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి అందించే ఆహారం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు వైద్యాధికారులు.  కరోనా బాధితులుకు గాంధీ ఆస్పత్రి సిబ్బంది వెజిటబుల్‌ బిర్యానీ, కిచిడీ, తాజా పండ్లు అందిస్తున్న‌ట్లుగా సూప‌రింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆహారంతో పాటు రోజూ డ్రైఫ్రూట్స్‌, కోడిగుడ్లు అందిస్తున్నట్లు చెప్పారు. మాంసాహారం, మసాలాల వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అనుమతించట్లేదని వివరించారు.

గాంధీలో మాంసాహారానికి అనుమతి లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ ఎం రాజారావు స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఇంటి నుంచి ఎవరైనా మాంసాహారం తీసుకొస్తే అనుమతించబోమని తెలిపారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఇఫ్తార్‌ కోసం బయటి వ్యక్తులు తీసుకొచ్చే మాంసాహారాన్ని కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. దీనికి బదులు పండ్లు, డ్రైఫ్రూట్స్‌ తెచ్చి ఇవ్వవచ్చని తెలిపారు. గాంధీలో రోగులకు మాంసాహారం అందిస్తున్నారని, రంజాన్ స్పెషల్స్ ఇస్తున్నారంటూ రెండు, మూడు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. సూపరింటెండెంట్ రాజారావు స్ప‌ష్ట‌తనిచ్చారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు