బెంగుళూరు.. ఇక లాక్ డౌన్ ఉండదు.. సీఎం ఎడియూరప్ప

బెంగుళూరులో కంటెయిన్మెంట్ జోన్లలో తప్ప ఇక ఎక్కడా లాక్ డౌన్ ఉండబోదని కర్ణాటక సీఎం ఎడియూరప్ప ప్రకటించారు. కరోనా వైరస్ ని అదుపు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. బెంగుళూరులో..

బెంగుళూరు.. ఇక లాక్ డౌన్ ఉండదు.. సీఎం ఎడియూరప్ప

Edited By:

Updated on: Jul 21, 2020 | 7:40 PM

బెంగుళూరులో కంటెయిన్మెంట్ జోన్లలో తప్ప ఇక ఎక్కడా లాక్ డౌన్ ఉండబోదని కర్ణాటక సీఎం ఎడియూరప్ప ప్రకటించారు. కరోనా వైరస్ ని అదుపు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. బెంగుళూరులో ఈ నెల 14 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే రేపటి నుంచి ఈ ఆంక్షలు ఉండబోవన్నారు ప్రజలు తమకు సహకరించాలని ఆయన కోరారు. . ఈ వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ పరిష్కారం కాబోదని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్టింగులు ముమ్మరం చేయాలనీ, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి చర్యలు దీని నివారణకు తోడ్పడతాయని ఆయన చెప్పారు. నగరంలో ఇప్పటివరకు 33 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.