కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఇదొక్కటే మార్గం కాదని.. జస్ట్ దాని వ్యాప్తిని మాత్రమే కంట్రోల్ చేయగలమని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోవైపు ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్ పరిశోధకులు కరోనాకు సిగరెట్ ద్వారా చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు. సిగరెట్‌లో ఉండే నికోటిన్‌తో ప్రయోగాలు మొదలుపెట్టారు. దీనితో ఫ్రాన్స్ ప్రభుత్వం నికోటిన్ […]

కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!
Follow us

|

Updated on: Apr 26, 2020 | 10:25 AM

కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఇదొక్కటే మార్గం కాదని.. జస్ట్ దాని వ్యాప్తిని మాత్రమే కంట్రోల్ చేయగలమని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోవైపు ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్ పరిశోధకులు కరోనాకు సిగరెట్ ద్వారా చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు. సిగరెట్‌లో ఉండే నికోటిన్‌తో ప్రయోగాలు మొదలుపెట్టారు. దీనితో ఫ్రాన్స్ ప్రభుత్వం నికోటిన్ ప్రత్యామ్నాయాల అమ్మకాలపై నిషేధం విధించింది. వచ్చే నెల 11వ తేది వరకు ఈ రూల్ అమలులో ఉంటుందని పేర్కొంది. అంతేకాక ఆన్లైన్ అమ్మకాలపై కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది.

దేశ జనాభాలో నికోటిన్ వినియోగించే రోగులు తక్కువగా ఉన్నారని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఒలివర్ వేరాన్ బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. అయితే కరోనా వైరస్ నుంచి పొగాకు రక్షిస్తుందని చెప్పట్లేదని.. టొబాకో చంపుతుందని..ఫ్రాన్స్‌లో ప్రతి సంవత్సరం 70,000 మందికి పైగా ప్రజలు ధూమపాన సంబంధిత అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్నారని వేరాన్ స్పష్టం చేశారు. పారిస్‌లోని పిటి-సాల్పాట్రియర్ ఆసుపత్రి పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఇతర వ్యక్తుల కంటే ధూమపానం చేసేవారు వైరస్ బారిన పడటం తక్కువని తేలింది. నికోటిన్ వైరస్ కణాలలోకి రాకుండా నిరోధించగలదని కూడా ఇది చూపించింది.

దీనితో సిగరెట్‌లో ఉండే నికోటిన్ ప్యాచులను చేతులకు అంటించి.. దాని ద్వారా కరోనా సోకకుండా నిరోధిస్తుందా లేదా అన్న పరిశోధనను ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు జరపనున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి నివేదిక బయటికి రానుంది. కాగా, ధూమపానం హనీకరం అని.. పొగాకు ఉపయోగించేవారు కరోనా బారిన పడితే.. వారు మరింత తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!

షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!

Latest Articles
అఫీషియల్.. ఓటీటీలో విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అఫీషియల్.. ఓటీటీలో విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. విచిత్రమైన రూల్స్‌
ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. విచిత్రమైన రూల్స్‌
స్పెయిన్ వీధుల్లో శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్
స్పెయిన్ వీధుల్లో శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్
ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..
ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..
బాబోయ్‌ గురక.. ఇంత డేంజరా..? లైట్‌ తీసుకుంటే తప్పదు మూల్యం..!
బాబోయ్‌ గురక.. ఇంత డేంజరా..? లైట్‌ తీసుకుంటే తప్పదు మూల్యం..!
అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం
మన ప్రొడక్షన్‌ హౌస్‌లకు తమిళ తంబిల కాల్షీట్‌.. వారు ఎవరంటే.?
మన ప్రొడక్షన్‌ హౌస్‌లకు తమిళ తంబిల కాల్షీట్‌.. వారు ఎవరంటే.?
సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ..!
సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ..!