
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగార్జున, అమలా అక్కినేనిల 28వ వివాహ వార్షికోత్సవం సింపుల్‌గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరందరికి నాగార్జున ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
`ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. అందరూ క్షేమంగా ఉండండలంటూ.. నాగార్జున ట్వీట్ పేర్కొన్నారు. అమలతో కలిసి డిన్నర్ చేస్తూ దిగిన ఫొటోను షేర్ చేశారు.