ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంటోంది వైరస్. దీన్ని కట్టడి చేసేందుకు ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ వ్యాధి పేరు చెబుతుంటేనే అందరూ వణికిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే కోవిడ్ నుంచి రక్షణ పొందటానికి ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎక్కువగా N95 మాస్కులు అనే మాట ఎక్కువగా వింటూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ మాస్కులు కరోనా చికిత్సలో భాగంగా వైద్యులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. అసలు ఈ N95 మాస్కులు అంటే ఏమిటి? వీటిని ఎవరు తయారు చేశారు? అనే డౌంట్ సాధారణంగా అందరికీ వచ్చే ఉండి ఉంటుంది. మరి ఆ సంగతులేంటో తెలుసుకుందాం.
మొదటగా 1910లో చైనాలో ప్రబలిన ప్లేగు వ్యాధి నుంచి తప్పించుకోవడం కోసం చైనా కోర్టులో పనిచేసే ఓ ఉద్యోగి వస్త్రంతో మాస్క్‌ను తయారు చేశాడు. నిజానికి చరిత్రలో ఇదే తొలి మాస్క్ అంటారు. ఆ తర్వాత వీటిని చాలా మంది వాడారు. అనంతరం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తొలి ప్రపంచ యుద్ధంలో గ్యాస్ మాస్కులు తయారయ్యాయి. ఆ తర్వాత 1972లో 3M అనే సంస్థ తొలిసారి N95 రిస్పిరేటర్స్‌ను రూపొందించింది. అయితే వీటిని కేవలం వస్త్ర పరిశ్రమల్లో మాత్రమే వాడేవారు.
కానీ అనంతరం ఆరోగ్య సంరక్షణలో భాగంగా బ్యాక్టీరియాను అడ్డుకొనే తొలి N95 మాస్కును 1992లో యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ ప్రొఫెసర్ పీటర్ తై రూపొందించారు. 1995లో ఈ ఎన్95 మాస్క్‌కు పెటెంట్ హక్కులు కూడా పొందారు. అప్పటి నుంచి ఎలాంటి ప్రమాదకర వైరస్ ప్రబలినా వీటిని వాడేవారు. ఆ తర్వాత ఇక అప్పుడెప్పుడో రిటైర్ అయిపోయిన పీటర్ తై ప్రస్తుతం మళ్లీ ఈ మాస్కులకు సంబంధించి ప్రయోగాలు చేసేకుందుకు సిద్ధమయ్యారు.
Read More:
బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..
అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..