వారికి గుడిసెల్లో దిగ్బంధం..

|

May 15, 2020 | 7:30 PM

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో సొంతూర్లకు చేరుకుంటున్న వారికి వినూత్న క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నారు అధికారులు.

వారికి గుడిసెల్లో దిగ్బంధం..
Follow us on

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో సొంతూర్లకు చేరుకుంటున్న వారికి వినూత్న క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా మణిపూర్ రాష్ట్రంలో వినూత్న రీతిలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారితోపాటు వలస కూలీలు నిబంధనల సడలింపుతో.. ఇప్పుడిప్పుడే సొంత గ్రామాలకు పయనమయ్యారు. ఇలా వచ్చిన వారిని మణిపూర్ ప్రభుత్వం 14 రెోజులపాటు క్వారంటైన్ లో ఉండేలా చర్యలు చేపట్టింది. దీంతో సేనాపతి జిల్లాలోని నాగ అనే గ్రామంలో అధికారులు వెదురు కర్రలతో 80 క్వాంటైన్ గుడిసెలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ కి 110 కిలో మీటర్ల దూరంలో ఉండేలా చూశారు. క్వారంటైన్ లో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రెగ్యులర్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ వినూత్న ఏర్పాట్లు చేసిన గ్రామ అధికారులను ఆ రాష్ట్ర సీఎం ఎన్ బిరెన్ సింగ్ అభినందించారు.

Video Courtesy: The Poumaiz