‘మేం వచ్ఛే ఏడాది జూన్ వరకు ఫ్రీ రేషన్ ఇస్తాం’…మమతా బెనర్జీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 30, 2020 | 6:55 PM

దేశంలో పేద కుటుంబాలకు నవంబరు వరకు ఉచిత రేషన్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్దిసేపటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దానికి 'కౌంటర్' ఇచ్చినంత పని చేశారు. తాము తమ రాష్ట్రంలోని..

మేం వచ్ఛే ఏడాది జూన్ వరకు ఫ్రీ రేషన్ ఇస్తాం...మమతా బెనర్జీ
Follow us on

దేశంలో పేద కుటుంబాలకు నవంబరు వరకు ఉచిత రేషన్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్దిసేపటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దానికి ‘కౌంటర్’ ఇచ్చినంత పని చేశారు. తాము తమ రాష్ట్రంలోని పేదలకు వచ్ఛే ఏడాది జూన్ వరకు ఉచిత రేషన్ ఇస్తామని ఆమె ప్రకటించారు. బెంగాల్ లో కూడా వచ్ఛే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రం ఇచ్ఛే బియ్యం, గోధుమల కన్నా తమ ప్రభుత్వం ఇచ్ఛే రేషన్ నాణ్యమైనదిగా ఉంటుందని దీదీ చెప్పారు. మా రాష్ట్రంలో కేవలం 60 శాతం మంది మాత్రమే కేంద్ర రేషన్ ని అందుకుంటున్నారు అని ఆమె అన్నారు. వచ్చే సంవత్సరం బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుంది. గత ఏడాది జరిగిన జనరల్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోని 42 లోక్ సభ సీట్లకు గాను బీజేపీ 18  స్థానాలను కైవసం చేసుకుంది.

కాగా-చైనాకు చెందిన 59 యాప్ లను కేంద్రం నిషేధించడాన్ని  ప్రస్తావించిన మమత.. కేవలం కొన్ని యాప్[ లను బ్యాన్ చేసినంత మాత్రాన ఫలితం ఉండదని, చైనాకు గట్టిగా బుధ్ది చెప్పాలని కోరారు. ఆ దేశానికి అప్పుడే దీటైన సమాధానం ఇఛ్చామన్న మోదీ వ్యాఖ్యలను ఆమె కొట్టిపారేశారు.