మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 12,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5లక్షలకు చేరుకుంది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3,38,262 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,47,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 17,367 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో పూణె, ముంబై నగరాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పూణె నగరంలో కూడా లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
12,822 #COVID19 cases & 275 deaths reported in Maharashtra today. Total number of cases in the state is now at 5,03,084, including 1,47,048 active cases & 17,367 deaths: State Health Department pic.twitter.com/2Sn6OnQ2Xr
— ANI (@ANI) August 8, 2020