మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆరు లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,84,754కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 4,08,286 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,56,409 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 19,749 మంది మరణించారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై, పూణె, థానే నగరాల్లోనే నమోదవుతున్నాయి. ఇక ధారవిలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుందనుకుంటున్న వేళ.. నిత్యం కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అయితే యాక్టివ్ కేసులు వంద వరకు మాత్రమే ఉండటంతో అక్కడి ప్రజలు ఊపిరి తీల్చుకుంటున్నారు.
12,614 new #COVID19 cases, 6,844 recoveries & 322 deaths reported in Maharashtra today, taking the total number of cases in the state to 5,84,754 including 1,56,409 active cases, 4,08,286 cured cases and 19,749 deaths till date: Public Health Department, Maharashtra pic.twitter.com/BCb5uEd8Lp
— ANI (@ANI) August 15, 2020
Read More :
16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా