తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు లాక్‌డౌన్ మినహాయింపు !

|

Apr 15, 2020 | 10:40 AM

కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తోంది. భార‌త్‌లోనూ కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు లాక్‌డౌన్ మినహాయింపు !
Telangana Lockdown
Follow us on
కంటికి కనిపించని మహమ్మారి కరోనాతో ప్రపంచ దేశాలు పోరాడుతున్నాయి. చైనాలో మొదలైన కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తోంది. భార‌త్‌లోనూ కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. 

దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఉదయానికి 10వేలు దాటగా.. గడచిన 24 గంటల్లో 1,400కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 14న జాతినుద్దేశించిన ప్ర‌సంగించిన ప్ర‌ధాని మోదీ లాక్‌డౌన్ మ‌రో 19 రోజుల పాటు పొడిగించారు. అయితే, దేశ‌వ్యాప్తంగా క‌రోనా ద‌రిచేర‌ని జిల్లాలు కూడా ఉన్నాయి. ఆయా జిల్లాలో ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందంటే..

 

ఇప్పటి వరకు దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలు 350వరకు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. వాటిలో  ఏపి నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, తెలంగాణ నుంచి మంచిర్యాల, వరంగల్(రూ),యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట జిల్లాల‌పై క‌రోనాకు దూరంగా ఉన్నాయి. వీటిలో లాక్‌డౌన్ నిబంధనలను త్వరలోనే సడలించే అవకాశం ఉందని  విశ్వ‌స‌నీయ‌ సమాచారం. ఇక దేశంలో మార్చి 24న తొలి విడత లాక్‌డౌన్ ప్రారంభమైన రోజుకు 600గా ఉన్న క‌రోనా పాజిటివ్‌ కేసులు.. రెండో విడ‌గ లాక్‌డౌన్ ముగిసేనాటికి 11వేలకు చేరుకుంది.