దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా తీవ్రత.. అత్యధిక కేసులు ఎక్కడ నమోదు అవుతున్నాయంటే..?

దేశంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారలు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా తీవ్రత.. అత్యధిక కేసులు ఎక్కడ నమోదు అవుతున్నాయంటే..?
Follow us

|

Updated on: Jan 25, 2021 | 10:19 AM

Highest daily Covid cases :  ఏడాది గడుస్తున్న దేశవ్యాప్తం కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం కొత్త కేసలు వెలుగుచూస్తునే ఉన్నాయి. దేశంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారలు వెల్లడించారు. కరోనా కేసుల నమోదు జాతీయ సగటు 1.9 శాతం కాగా, కేరళలో కరోనా వేగంగా సంక్రమిస్తూ 12.48 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ కరోనా పరీక్షలను లక్షకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సిఫారసు చేసింది. అయితే కేరళ రాష్ట్రంలో రోజువారీగా 40వేల నుంచి 60 వేలమందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యుడు డాక్టర్ సుల్ఫీ నుహు చెప్పారు.

ఇదిలావుంటే, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని కేరళ సర్కారు అంగీకరించింది. కేరళలో 15 శాతం వెంటిలేటర్లు, 49 శాతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో మాత్రమే రోగులున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తాము కరోనా టెస్టు పాజిటివ్ రేటు కంటే ఆసుపత్రుల్లో కరోనా రోగుల అడ్మిషన్ రేటు, ఐసీయూ అడ్మిషన్, వెంటిలేటర్ ఆక్యుపెన్సీలను పరిశీలిస్తామని కొవిడ్ కోర్ కమిటీ తెలిపింది. కాగా, చాలా వరకు రోగులకు త్వరగా కోలుకుని ఇళ్లకు చేరుతున్నారన్నారు. మరోవైపు కరోనా రోగుల మరణాల శాతం అత్యల్పంగానే ఉందని కేరళ సర్కారు చెబుతోంది. కేరళ రాష్ట్రంలో ఆదివారం 6,036 కరోనా కేసులు వెలుగుచూశాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.

Read Also…  Gold and Silver Rates : బంగారం ప్రియులకు శుభవార్త.. మరోసారి దిగివచ్చిన పసిడి ధరలు.. అదేదారిలో వెండి