కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 6,670 కరోనా పాజిటివ్‌ కేసులు..

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Updated on: Aug 08, 2020 | 1:08 AM

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 6,670 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,64,924కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 84,232 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,686 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా బెంగళూరు నగరంలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బెంగళూరు అర్బన్‌లోనే 2,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us