‘ఈ వైరస్ లేనట్టే’! ఇటలీ డాక్టర్ ! ‘సంబరపడొద్దు’…ప్రపంచ ఆరోగ్య సంస్థ

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 12:03 PM

కొత్త కరోనా వైరస్ దేశంలో(ఇటలీలో) లేనట్టేనంటూ అక్కడి  ఓ ప్రముఖ డాక్టర్ చేసిన ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. మూడు నెలల క్రితం దేశంలో విధించిన లాక్ డౌన్ ని...

ఈ వైరస్ లేనట్టే! ఇటలీ డాక్టర్ ! సంబరపడొద్దు...ప్రపంచ ఆరోగ్య సంస్థ
Follow us on

కొత్త కరోనా వైరస్ దేశంలో(ఇటలీలో) లేనట్టేనంటూ అక్కడి  ఓ ప్రముఖ డాక్టర్ చేసిన ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. మూడు నెలల క్రితం దేశంలో విధించిన లాక్ డౌన్ ని మెల్లగా సడలించడానికి ఇటాలియన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సమయంలో.. అల్బర్టో జాంగ్రీల్లో అనే పేరు మోసిన డాక్టర్ ఒకరు ఈ సరికొత్త ప్రకటన చేశాడు. నిజం చెప్పాలంటే.. ఈ కరోనా వైరస్ దేశంలో మటుమాయమైందని ‘చల్లని కబురు’ చెప్పాడు. మిలన్ లోని ఓ పెద్ద ఆసుపత్రిలో ఈయన సీనియర్ వైద్యుడట. గత 10 రోజుల్లో నిర్వహించిన టెస్టులను, రెండు నెలల క్రితం చేసిన టెస్టులను పోల్చి చూసినప్పుడు.. తాజాగా నిర్వహించిన టెస్టులో కనబడిన వైరస్ బలహీనంగా కనిపించిందని ఆయన పేర్కొన్నాడు. అంటే దీని అర్థం కరోనా వైరస్ లేనట్టే కదా అన్నాడాయన. కానీ అనేకమంది ఇతర డాక్టర్లు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఈ మహమ్మారి ఇంకా ఇంత బీభత్సం సృష్టిస్తుంటే వైరస్ లేదంటారేమిటంటూ వాళ్లంతా ‘గయ్యిమన్నారు’. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.. ఇప్పుడే సంబర పడవద్దని, ఇది ఇప్పటికీ ‘కిల్లర్ వైరసే’ నని షాకింగ్ సమాచారమిచ్చింది. దీనిపట్ల మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఇటలీలో కరోనా వైరస్ బారిన పడి 33 వేల మంది రోగులు మరణించారు.