
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం బాలిగాం దగ్గర ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 33 మందికి గాయాలయ్యాయి. వీరిలో 18మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు సిబ్బంది ముగ్గురు పరారయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారిని మందస, సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన బస్సు స్నేహలత ట్రావెల్స్‌కి చెందినదిగా తెలుస్తోంది. బెంగుళూరు నుంచి బెంగాల్ వెళ్తుండగా నేషనల్ హైవే16పై ప్రమాదానికి గురైంది. వలస కూలీలు కర్నాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులంతా పశ్చిమ్ బంగాల్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.