కరోనా ఎఫెక్ట్‌: శ్రీలంక టూర్ వాయిదా వేసిన బీసీసీఐ

కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి తాజాగా శ్రీలంకలో టీమిండియా పర్యటన కూడా వాయిదా పడింది. క్రికెట్ వినోదం ఆస్వాదించవచ్చని భావించిన ఫ్యాన్స్‌కు మరింత నిరుత్సాహం తప్పలేదు. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు జూలైలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్న పరిస్థితుల్లో భారత క్రికెటర్లను శ్రీలంక పంపలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా పర్యటన ఏర్పాటు చేయలేమని […]

కరోనా ఎఫెక్ట్‌: శ్రీలంక టూర్ వాయిదా వేసిన బీసీసీఐ

Updated on: Jun 11, 2020 | 9:35 PM

కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి తాజాగా శ్రీలంకలో టీమిండియా పర్యటన కూడా వాయిదా పడింది. క్రికెట్ వినోదం ఆస్వాదించవచ్చని భావించిన ఫ్యాన్స్‌కు మరింత నిరుత్సాహం తప్పలేదు. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు జూలైలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్న పరిస్థితుల్లో భారత క్రికెటర్లను శ్రీలంక పంపలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా పర్యటన ఏర్పాటు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసింది. శ్రీలంకలో టీమిండియా పర్యటనను రద్దు చేసింది. శ్రీలంక, టీమిండియా మధ్య జరిగే ఆట చూడాలని ఆశించిన అభిమానులకు ఈ వార్త నిరాశను మిగిల్చింది. మరో వైపు ఐపీఎల్ జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించిన విశయం తెలిసిందే.