చైనాలోని వుహాన్‌లో 2019 నవంబర్ నెలలో పుట్టిన కరోనా… ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టేసింది. తన పంజాను దేశదేశాలపై విసిరి లక్షలాది మంది ప్రజలను బలితీసుకుంది… తీసుకుంటోంది.. వందల దేశాలు కరోనా మహమ్మారికి విలవిలలాడుతున్నాయి. అయితే, భారత దేశంలోనూ ఈ మహమ్మారి తన ప్రభావాన్ని చూపింది. జనవరి31, 2020న తొలి కేసు నమోదైంది. కేరళలోని త్రిశూర్ కి చెందిన విద్యార్థికి కరోనా సోకినట్లు తేలింది. ఆ విద్యార్థి చైనా లోని వూహన్ నుంచి వచ్చినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇటీవల భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. ఈ నేపథ్యంలో సున్నా నుంచి కోటికి పైగా కేసుల పెరుగుదల ఇలా ఉంది…
19 డిసెంబర్ 2020 నాటికి కరోనా కేసుల సంఖ్య 1,00,04,599
కరోనా పాజిటివ్ తో మరణాలు 1,45, 136
కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 95, 49,923
తేదీ నెల సంవత్సరం… కేసుల సంఖ్య మరణాలు
19 మే 2020 1,01,139 ( లక్ష) 3,163
03 జూన్ 2020 2,07,615 ( 2 లక్షలు) 5,815
27 జూన్ 2020 5,08,953 (5 లక్షలు) 15,685
17 జులై 2020 10,03,832 (10 లక్షలు) 25,602
7 ఆగస్టు 2020 20,27,074 (20 లక్షలు) 41,585
23 ఆగస్టు 2020 30,44,940 (30 లక్షలు) 56,706
5 సెప్టెంబర్ 2020 40,23,179 (40 లక్షలు) 69,561
16 సెప్టెంబర్ 2020 50,20,359 (50 లక్షలు) 82,066
28 సెప్టెంబర్ 2020 60,74,702 (60 లక్షలు) 95,542
03 అక్టోబర్ 2020 64,73,544 1,00,842 (లక్ష దాటిన మరణాలు)
11 అక్టోబర్ 2020 70,53,806 (70 లక్షలు) 1,08,334
29 అక్టోబర్ 2020 80,40,203 (80 లక్షలు) 1,20,527
20 నవంబర్ 2020 90,04,365 (90 లక్షలు) 1,32,162
03 డిసెంబర్ 2020 95,34,964 (95 లక్షలు) 1,38,648
15 డిసెంబర్ 2020 99,06,165 1,43,709
19 డిసెంబర్ 2020 1,00,04,599 (కోటి కేసులు) 1,45, 136
India’s recovery rate improves to 95.40% amongst highest in the World. #IndiaFightsCorona #Unite2FightCorona pic.twitter.com/JhRMLWvn7I
— MyGovIndia (@mygovindia) December 19, 2020