Sania Mirza Corona Positive : సానియా మీర్జాకు కరోనా పాజిటివ్.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్న టెన్నిస్ స్టార్

|

Jan 20, 2021 | 6:37 AM

తాను కోవిడ్ బారినపడినట్టు భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా వెల్లడించారు. ఈ వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఆమె సోషల్ మీడియా...

Sania Mirza Corona Positive : సానియా మీర్జాకు కరోనా పాజిటివ్.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్న టెన్నిస్ స్టార్
Follow us on

Sania Mirza Corona Positive : తాను కోవిడ్ బారినపడినట్టు భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా వెల్లడించారు. ఈ వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కోవిడ్ సమయంలో తన అనుభవాల్ని సానియా మీర్జా ట్వీట్‌లో పోస్ట్ చేశారు.

కరోనా  పాజిటివ్ అని తేలినప్పటికీ.. తనకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని సానియా వివరించారు. అయినా తాను ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లోనే ఉన్నానని అన్నారు. ఈ సమయంలో తన బాబు, కుటుంబాన్ని విడిచిపెట్టి ఉండడం చాలా కష్టంగా అనిపించిందని సానియా వాపోయారు.

ఇదే సమయంలో కరోనా బారినపడి అందరికీ దూరంగా ఆస్పత్రులలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు ఎలాంటి బాధను అనుభవించాయన్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజుకో కొత్త లక్షణం కనిపించినప్పుడు ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని … భౌతికంగా మానసికంగా ఎంతో సంఘర్షణకు గురవుతామని తన అనుభవాల్ని రాసుకొచ్చారు.

అయితే కొద్దో గొప్పో తాను అదృష్టవంతురాలినని సానియా పేర్కొన్నారు. కాకపోతే కుటుంబానికి దూరంగా ఉండటం మాత్రం భయంకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఫ్యామిలీని ఎప్పుడు చూస్తామో తెలియదన్న సానియా.. కరోనా వైరస్ జోక్ కాదని వెల్లడించారు.

వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉందని… మన సన్నిహితులను … కుటుంబాన్ని దీని నుంచి కాపాడుకోవడాన్ని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం మాస్కులు ధరించడంతో పాటు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సానియా కోరారు.

ఇవి కూడా చదవండి : 

టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు.. కార్లు ఇప్పిస్తానంటూ మోసానికి..!
రైతుల నిరసనలకు మద్దతుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు.. స్వయంగా పాట రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి ఆలపించిన సిస్టర్స్..