బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న 75 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించాలని.. రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. మార్చి 31 వరకూ అత్యవసర మినహా అన్ని రవాణా సౌకర్యాలను మూసివేయాలని..

బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్

Updated on: Mar 22, 2020 | 3:25 PM

భారత్‌లో కరోనా నియంత్రణపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ అలాగే పీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్రల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనతా కర్ఫ్యూకి దేశ ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించినట్టుగా చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న 75 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించాలని.. రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. మార్చి 31 వరకూ అత్యవసర మినహా అన్ని రవాణా సౌకర్యాలను మూసివేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దీనిపై కీలక నిర్ణయం ప్రకటించాయి. రాజస్థాన్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. గూడ్స్ రైళ్లు మినహా అన్ని లాక్‌డౌన్ సర్వీసులను ఇప్పటికే రద్దు చేసింది. ఇక మెట్రో సర్వీసులను మార్చి 31 వరకూ నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే అంతర్జాతీయ రవాణా వ్యవస్థను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more also: కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..

కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..

Loading...
Unable to load recommendations.
Follow Us