అఫ్రీదీకి కరోనా సోకడంపై స్పందించిన గంభీర్‌

పాక్ క్రికెటర్ షాహిద్‌ అఫ్రీదీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజలుగా ఆయన అస్వస్థతకు గురవుతుండటంతో.. కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

అఫ్రీదీకి కరోనా సోకడంపై స్పందించిన గంభీర్‌

Updated on: Jun 13, 2020 | 11:20 PM

పాక్ క్రికెటర్ షాహిద్‌ అఫ్రీదీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజలుగా ఆయన అస్వస్థతకు గురవుతుండటంతో.. కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. అయితే నిత్యం అఫ్రీదీకి, మన భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ మధ్య మాటల యుద్ధం గురించి తెలిసిందే. ఉప్పు,నిప్పులా ట్విట్టర్ వేదికగానే వీరిద్దరూ మాటలయుద్ధం కొనసాగిస్తుంటారు. అయితే తాజాగా అఫ్రీదీకి కరోనా సోకడంపై గౌతం గంభీర్ స్పందించారు. తమ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలున్నప్పటికీ.. అవి వ్యక్తిగతంగా కాదని.. అఫ్రీదీ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us