‘ఎంఎస్ఎంఈ’ నిర్వచనం మార్చిన ప్రభుత్వం

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2020 | 5:42 PM

మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైసెస్ (ఎంఎస్ఎంఈ) ల నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చింది. ఈ మార్పు నేపథ్యంలో.. వీటి ఇన్వెస్ట్ మెంట్ పరిమితిని పెంచినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే నిర్వచనాన్ని ఇలా మార్చినంత మాత్రాన.. ఉత్పాదక సంస్థకు, సర్వీస్ సెక్టార్ సంస్థకు మధ్య పెద్ద తేడా ఉండదన్నారు. ఇకపై కోటి రూపాయల పెట్టుబడి, 5 కోట్ల టర్నోవర్ ఉన్న ఒక సంస్థను మైక్రో సంస్థగా గుర్తిస్తారని ఆమె చెప్పారు. ఇప్పటివరకు 10 లక్షల […]

ఎంఎస్ఎంఈ నిర్వచనం మార్చిన ప్రభుత్వం
Follow us on

మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైసెస్ (ఎంఎస్ఎంఈ) ల నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చింది. ఈ మార్పు నేపథ్యంలో.. వీటి ఇన్వెస్ట్ మెంట్ పరిమితిని పెంచినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే నిర్వచనాన్ని ఇలా మార్చినంత మాత్రాన.. ఉత్పాదక సంస్థకు, సర్వీస్ సెక్టార్ సంస్థకు మధ్య పెద్ద తేడా ఉండదన్నారు. ఇకపై కోటి రూపాయల పెట్టుబడి, 5 కోట్ల టర్నోవర్ ఉన్న ఒక సంస్థను మైక్రో సంస్థగా గుర్తిస్తారని ఆమె చెప్పారు. ఇప్పటివరకు 10 లక్షల వరకు పెట్టుబడి గల సర్వీస్ సెక్టార్ కంపెనీని, 25 లక్షల పెట్టుబడి గల మాన్యుఫాక్చరింగ్ సంస్థను మైక్రో కంపెనీగా పరిగణించేవారన్నారు. ఇలాగే 10 కోట్ల పెట్టుబడి, 50 కోట్ల టర్నోవర్ గల కంపెనీని స్మాల్ కంపెనీగా, 20 కోట్ల ఇన్వెస్ట్ మెంట్, 100 కోట్ల టర్నోవర్ గల సంస్థను మీడియం సంస్థగా పరిగణిస్తూ వఛ్చినట్టు ఆమె వివరించారు. కాగా… 200 కోట్ల లోపు ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్లకు గ్లోబల్ టెండర్లను   ప్రభుత్వం ఇకపై అనుమతించబోదని ఆమె తెలిపారు.