మిస్టరీ డెత్: నురగలు కక్కుతూ 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్‌లో గురవారం మూడు కుక్కలు, 50 కాకులు నురగలు కక్కుకుని మృతి చెందటం స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది.

మిస్టరీ డెత్: నురగలు కక్కుతూ 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

Updated on: Apr 24, 2020 | 2:10 PM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఊహించని విధంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజల్లో భయబ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్‌లో గురవారం మూడు కుక్కలు, 50 కాకులు నురగలు కక్కుకుని మృతి చెందటం స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది.

దీనితో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పశుసంవర్ధక అధికారులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకొని కుక్కలు, కాకుల కళేబరాల నుంచి నమూనాలను సేకరింఛి పరీక్షలు చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చిన అనంతరం మృతి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.

కాగా, దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో మూగ జీవుల మరణాలు ఎక్కువైపోతున్నయి. ఇటీవల కర్నూలు జిల్లాలో పెద్ద సంఖ్యలో కాకులు, కోతుల మరణాలు సంభవించగా.. విజయవాడలో ఆవుల కళ్లలో నుంచి రక్తం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని ఆకలికి తాళలేక చనిపోతుంటే.. మరికొన్నింటికి అంటువ్యాధులు సోకి మృతి చెందటం బాధాకరమని చెప్పాలి.

ఇవి చదవండి:

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..

గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం కట్.. సీఎం కీలక నిర్ణయం..

నేటి నుంచి సున్నా వడ్డీ పధకం.. వివరాలు ఇవే..