మీకు శాశ్వతంగా నిధుల ఆపివేసే యోచన.. వరల్డ్ హెల్త్ సంస్థకు ట్రంప్ వార్నింగ్

| Edited By: Pardhasaradhi Peri

May 19, 2020 | 10:40 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) మరో 30 రోజుల్లో తన పనితీరుకు సంబంధించి గణనీయమైన మెరుగుదలను చూపకపోతే ఆ సంస్థకు శాశ్వతంగా నిధులను స్తంభింపజేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

మీకు శాశ్వతంగా నిధుల ఆపివేసే యోచన.. వరల్డ్ హెల్త్ సంస్థకు ట్రంప్ వార్నింగ్
Follow us on

ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) మరో 30 రోజుల్లో తన పనితీరుకు సంబంధించి గణనీయమైన మెరుగుదలను చూపకపోతే ఆ సంస్థకు శాశ్వతంగా నిధులను స్తంభింపజేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ విషయంలో ‘హూ’ చైనాకు మద్దతుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ గత నెలలో ఆయన ఈ సంస్థకు నిధులను నిలుపుదల చేశారు. తన హెచ్చరికకు సంబంధించి ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెజ్రేసెస్ కి ఓ లేఖ రాస్తూ.. దాన్ని ట్వీట్ కూడా చేశారు. ఈ లేఖ ‘ నాకు నేను సంజాయిషీ ఇచ్చుకునేట్టుగా ఉంది. అని ఆయన సెటైర్ కూడా వేశారు. కరోనా వైరస్ కు సంబంధించిన రిపోర్టుల పట్ల ఈ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, పైగా దీనిని హాండిల్ చేయడంలో చైనాకు తొత్తుగా.. ఆ దేశంపట్ల పక్షపాత ధోరణి చూపిందని ట్రంప్ పేర్కొన్నారు. మీరు, మీ సంస్థ చేసిన పొరబాట్లకు ప్రపంచ దేశాలు మూల్యం చెల్లించుకోవలసివస్తోందన్నారు. చైనా నుంచి ఎప్పుడు మీరు ‘విముక్తులు’ అవుతారని ఆయన ప్రశ్నించారు. రానున్న 30 రోజుల్లో మీ పనితీరులో గణనీయమైన మెరుగుదల చూపకపోతే..(అంటే మీ వైఖరి మార్చుకోకపోతే) శాశ్వతంగా మీ సంస్థకు నిధులను స్తంభింప జేస్తామని, పైగా  మీ సంస్థలో మా సభ్యత్వాన్ని రద్దు చేసుకునే విషయమై పునరాలోచిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.