పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్ బీర్ సింగ్ కి కోవిడ్ పాజిటివ్

పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్ బీర్ సింగ్ సిద్దుకి కరోనా పాజిటివ్ అని తేలింది. రైతు చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన సంగ్రూర్ లో నిన్న జరిగిన సభలో ఈయన పార్టీ నేత రాహుల్ గాంధీతో..

పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్ బీర్ సింగ్ కి కోవిడ్ పాజిటివ్

Edited By:

Updated on: Oct 06, 2020 | 7:47 PM

పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్ బీర్ సింగ్ సిద్దుకి కరోనా పాజిటివ్ అని తేలింది. రైతు చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన సంగ్రూర్ లో నిన్న జరిగిన సభలో ఈయన పార్టీ నేత రాహుల్ గాంధీతో బాటు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్, ఇతర పార్టీ నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. బల్ బీర్ సింగ్ హెల్త్ నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారని డాక్టర్లు తెలిపారు.  ఇటీవలి కాలంలో ఆయనతో కాంటాక్ట్ లో ఉన్నవారికందరికీ కరోనా టెస్టులు చేస్తామని వారు చెప్పారు. సంగ్రూర్ లో జరిగిన ఇతర కార్యక్రమాల్లోనూ రాహుల్, అమరేందర్ సింగ్ పాల్గొనడం విశేషం.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us