కరోనా వేళ.. గాంధీ ఆస్పత్రిలో మరో రికార్డ్..

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2020 | 5:08 PM

ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ప్రాంతం, భాష, కులం, మతం అన్న తేడా లేకుండా అందర్నీ అంటుకుంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పలువురు గర్భిణీలకు కూడా కరోనా సోకింది. దీంతో వారిని ఆస్పత్రి తరలించి చికిత్స అందుతున్నారు. తాజాగా బుధవారం కరోనా మహమ్మారితో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండు రోజుల క్రితమే బాధితురాలు గాంధీ ఆస్పత్రిలో చేరగా.. ఆమెకు […]

కరోనా వేళ.. గాంధీ ఆస్పత్రిలో మరో రికార్డ్..
Follow us on

ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ప్రాంతం, భాష, కులం, మతం అన్న తేడా లేకుండా అందర్నీ అంటుకుంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పలువురు గర్భిణీలకు కూడా కరోనా సోకింది. దీంతో వారిని ఆస్పత్రి తరలించి చికిత్స అందుతున్నారు. తాజాగా బుధవారం కరోనా మహమ్మారితో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండు రోజుల క్రితమే బాధితురాలు గాంధీ ఆస్పత్రిలో చేరగా.. ఆమెకు ప్రత్యేకంగా శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అయితే తల్లికి కరోనా పాజిటివ్ ఉన్న నేపథ్యంలో.. పుట్టిన బిడ్డకు కరోనా పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే కరోనా బారినపడ్డి ఓ గర్భిణీ కూడా ప్రసవించింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని దాదాపు అందర్నీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.