వరల్డ్ అప్డేట్: 28 లక్షల కరోనా కేసులు, 1.97 మృతులు..

|

Apr 25, 2020 | 10:05 AM

కరోనా వైరస్ మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2,830,082 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 197,246కి చేరింది. అయితే రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. ఇప్పటి దాకా 798,776 మంది ఈ వైరస్ బారి […]

వరల్డ్ అప్డేట్: 28 లక్షల కరోనా కేసులు, 1.97 మృతులు..
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2,830,082 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 197,246కి చేరింది. అయితే రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. ఇప్పటి దాకా 798,776 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. అత్యధికంగా పాజిటివ్ కేసులు(925,038), మరణాలు(52,185) కూడా ఈ దేశంలోనే నమోదయ్యాయి. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా, కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా మరోసారి వైరస్ ఛాయలు కనిపిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 24,506 కరోనా కేసులు నమోదయ్యాయి. 775 మంది ప్రాణాలు కోల్పోగా, 5063 మంది కోలుకున్నారు.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..