వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 86 లక్షలు..

ప్రపంచవ్యాప్తంగా 8,642,696 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 457,919 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 4,569,619 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 86 లక్షలు..

Updated on: Jun 19, 2020 | 10:13 PM

యావత్ మానవజాతిని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 8,642,696 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 457,919 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 4,569,619 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఏకంగా 1,40,528 కేసులు, 5123 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో కొంచెం ప్రజలకు అది ఊరటను ఇస్తోంది.

అమెరికా, బ్రెజిల్, స్పెయిన్,బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తుండటంతో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(2,276,355), మరణాలు(120,892) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 984,315 నమోదు కాగా, మృతుల సంఖ్య 47,897కు చేరింది. ఇక రష్యాలో 569,063 పాజిటివ్ కేసులు, 7,841 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 385,276 నమోదు కాగా, మృతుల సంఖ్య 12,677కి చేరింది. కాగా, గడిచిన రెండు మూడు రోజుల్లో ఇండియాలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. అటు గడిచిన 24 గంటల్లో 13,586 మందికి క‌రోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఒక రోజు వ్యవధిలో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొద‌టిసారి.

Loading...
Unable to load recommendations.
Follow Us