
ఐపీఎల్ జరగకుంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వడం కష్టమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి ఆటకు దూరమైనా ధోని ఐపీఎల్‌లో రాణిస్తేనే టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని.. కానీ దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో టోర్నీ నిర్వహించే అవకాశాలు కనిపించట్లేదని అన్నాడు.
ధోని స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేస్తే బాగుంటుందని గంభీర్ చెప్పాడు. ఇప్పటికే అతడు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. ఏ స్థానంలోనైనా రాహుల్ చక్కగా ఆడగలడని తెలిపాడు. మరోవైపు ఐపీఎల్ ఈ ఏడాది జరగకపోతే.. ధోనిని సెలెక్టర్లు ఏం చూసి ఎంపిక చేస్తారన్న గంభీర్.. రిటైర్మెంట్ అన్నది ధోని పర్సనల్ విషయమని చెప్పుకొచ్చాడు.
ఇవి చదవండి:
జగన్ సర్కార్ సంచలనం.. బ్లడ్ డొనేషన్ క్యాంపులపై నిషేధం..
Flash News: మే 3 వరకు ఐపీఎల్ వాయిదా.. సౌరవ్ గంగూలీ ప్రకటన..
లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!