అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు.. ప్రతి 33 సెకన్లకు ఒకరు.. వారం రోజుల్లో 18,000ల మంది మృతి

కరోనా వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకునే సమయంలో కొత్తవైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది.

అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు.. ప్రతి 33 సెకన్లకు ఒకరు.. వారం రోజుల్లో 18,000ల మంది మృతి

Updated on: Dec 22, 2020 | 7:17 PM

కరోనా వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకునే సమయంలో కొత్తవైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. గత వారం రోజులుగా అమెరికాలో ప్రతి 33 సెకన్లకు ఒకరు కరోనా తో మృతిచెందుతున్నారని రాష్ట్ర, కౌంటీ నివేదికలు పేర్కొంటున్నాయి. గడిచిన వారం రోజుల్లో 18,000ల మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ఏడాది చివరి రోజులు కావడంతో ప్రజలు ప్రయాణాలు చెయ్యవద్దని ఆరోగ్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. టెన్సిసీ, కాలిఫోర్నియా, రోడ్ ఐలాండ్ రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయోవా, సౌత్ డకోటా, రోడ్ ఐలాండ్లో మరణాల రేటు అధికంగా ఉందని,  దేశవ్యాప్తంగా 11.3శాతం మందికి రెండోసారి తిరిగి కరోనా సోకిందని అధికారులు తెలుపుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us