దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

|

Mar 29, 2020 | 11:14 AM

Coronavirus In India: ప్రస్తుతం ప్రపంచాదేశాలను కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారు, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తలు దీనికి విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. అయితే ఒక్క మందు కనిపెట్టడమే కాదు.. నిమిషాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసే పరికరాన్ని కూడా కనుక్కోవడం వారి ముందున్న మరో లక్ష్యం. ఈ క్రమంలోనే పూణేకు చెందిన మైలా డిస్కవరీ డయాగ్నస్టిక్ ఫర్మ్ […]

దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే...
Follow us on

Coronavirus In India: ప్రస్తుతం ప్రపంచాదేశాలను కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారు, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తలు దీనికి విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. అయితే ఒక్క మందు కనిపెట్టడమే కాదు.. నిమిషాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసే పరికరాన్ని కూడా కనుక్కోవడం వారి ముందున్న మరో లక్ష్యం.

ఈ క్రమంలోనే పూణేకు చెందిన మైలా డిస్కవరీ డయాగ్నస్టిక్ ఫర్మ్ సక్సెస్ సాధించింది. దేశంలోనే తొలి కోవిడ్ 19 టెస్టింగ్ కిట్ డెవలప్ చేసింది. ఈ కిట్ ద్వారా తక్కువ సమయంలోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించవచ్చు. ఇక ఈ కిట్ తయారీ వెనుక ఓ మహిళ శ్రమ, కృషి, పట్టుదల ఉంది. ఆమే మినల్ దక్ వే భోస్లే.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. కిట్ తయారు చేసే సమయంలో ఆమె గర్భిణి.. కొన్ని గంటల్లో డెలివరీ కావాల్సి ఉన్నా.. దేశం, ప్రజల శ్రేయస్సు కోసం టెస్టింగ్ కిట్ పై ప్రయోగాలు చేశారు.

మినల్ ఓ వైరాలజిస్ట్. ఆమె మైల్యాబ్స్ లో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చీఫ్. ఈమె ఆధ్వర్యంలోనే కేవలం ఆరు వారాల్లోనే ఈ కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ డెవలప్ చేయడం విశేషం. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ‘ నేను ఇది ఓ సవాల్‌గా తీసుకున్నాను. ఈ కిట్ దేశానికీ చాలా అవసరం.. ఇలా నా దేశానికీ నేను సేవ చేశానని’ ఆమె తెలిపారు. మా బృందంలో మొత్తం 10 మంది ఉన్నాం. అందరం కూడా ఈ కిట్ తయారీకి తీవ్రంగా శ్రమించాం. ఇక ఈ కిట్ ద్వారా కేవలం రెండున్నర గంటల్లో కరోనా పరీక్షలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. కాగా మైల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ చట్టబద్ధమైన ఆమోదం పొందటంతో రోజుకు 15 వేలకు పైగా కోవిడ్ టెస్టింగ్ కిట్లు తయారు చేస్తున్నారు. ఇక ఫస్ట్ బ్యాచ్‌లో తయారైన కిట్లను పూణే, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరులోని డయాగ్నస్టిక్ ల్యాబ్స్ కు పంపారు.

Read This: కరోనాపై యుద్ధం.. పోలీస్‌గా మారిన క్రికెటర్.. ఐసీసీ సెల్యూట్..