కరోనా అప్డేట్: కోటికి చేరువైన పాజిటివ్ కేసులు..

ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9,714,860 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 491,856 మంది  కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 5,250,087 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. […]

కరోనా అప్డేట్: కోటికి చేరువైన పాజిటివ్ కేసులు..

Updated on: Jun 26, 2020 | 11:48 AM

ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9,714,860 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 491,856 మంది  కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 5,250,087 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఏకంగా 1,79,718 కేసులు, 5179 మరణాలు సంభవించాయి. అయితే గత కొద్దిరోజులుగా ప్రపంచంలో రికవరీ రేటు అధికంగా ఉండటం ప్రజలను కొంచెం ఊరటను ఇస్తోంది.

అమెరికా, బ్రెజిల్, స్పెయిన్,బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఈ దేశంలోనే అత్యధిక కేసులు(2,504,588), మరణాలు(126,780) సంభవించాయి. అటు బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 1,233,147 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా మరణాల సంఖ్య 55,054కి చేరింది. ఇక రష్యాలో 613,994 పాజిటివ్ కేసులు, 8,605 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 4,90,401 నమోదు కాగా, మృతుల సంఖ్య 15,301కి చేరింది. కాగా, గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 17,296 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 407 మరణాలు సంభవించాయి.

Follow Us