పిల్లిగారికి సెక్యూరిటీ ఉద్యోగం.. ఎక్కడంటే?

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 8:26 PM

ఆస్ట్రేలియాలోని ఎప్‌వర్త్‌ అనే హాస్పిటల్‌.. బయట తిరిగే ఓ పిల్లికి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇచ్చింది. పిళ్లి మెడలో దాని ఫొటోతో ఉన్న ఓ ఐడీ కార్డు కూడా ఉంది. అందులో పిల్లి ఎల్వుడ్ అని రాసి ఉంది. ఈ కార్డును అక్కడ ఐ కార్డ్‌ అని పిస్తూంటారు. ఇక ఆస్పత్రిలోని పాథాలజీ డిపార్ట్‌మెంట్ ప్రకారం..

పిల్లిగారికి సెక్యూరిటీ ఉద్యోగం.. ఎక్కడంటే?
Follow us on

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది వ్యాపారాలు మూతపడటంతో వేర్వేరు పనులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ జంతువుకి ఉద్యోగం లభించిందంటే చిత్రమే కదా. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఐడీ కార్డ్ మెడలో వేసుకుని.. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం పొందిన పిళ్లికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని ఎప్‌వర్త్‌ అనే హాస్పిటల్‌.. బయట తిరిగే ఓ పిల్లికి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇచ్చింది. పిళ్లి మెడలో దాని ఫొటోతో ఉన్న ఓ ఐడీ కార్డు కూడా ఉంది. అందులో పిల్లి ఎల్వుడ్ అని రాసి ఉంది. ఈ కార్డును అక్కడ ఐ కార్డ్‌ అని పిస్తూంటారు. ఇక ఆస్పత్రిలోని పాథాలజీ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఇప్పుడు ఈ ఎల్వుడ్ అనే పిల్లి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్టు లెక్క. ఈ పిల్లి గత సంవత్సరం నుంచి ఈ హాస్పిటల్ గేటు వద్ద కలియ తిరుగుతూ ఉండేదట. దీంతో ఆ ఆసుపత్రి యాజమాన్యానికి ఈ ఐడియా వచ్చిందట. అలాగే ఈ పిల్లికి టైమ్‌కి ఫుడ్ పెట్టి, ఆరోగ్యం ఎలా ఉందో వారానికి ఓసారి చెక్ చేస్తుస్తోందట ఆస్పత్రి యాజమాన్యం.

Read More:

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

మరో ఏపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

బ్రేకింగ్: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ బిల్డింగ్ సీల్డ్